*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి* *నగరంలో పాత్రికేయులకు ఉచిత గుండె వైద్య శిబిరం* *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్* నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి పిలుపునిచ్చారు. నగరంలోని సాయిరాం రిడ్జ్ కంఫర్ట్‌లో 'అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా' మరియు 'మాధవ్ భాగ్ అడ్వాన్స్ ఆయుర్వేద హాస్పిటల్' సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి జర్నలిస్టుకు పరీక్షలను స్వయంగా ఆయనే ప్రారంభించి, అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జర్నలిస్టులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రస్తుత జీవనశైలిలో గుండె సంబంధిత సమస్యలు పలు రకాలుగా ఉత్పన్నమవుతున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు. పాత్రికేయులు వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమిస్తూ, గుండెను పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు.జర్నలిస్ట్ ఆరోగ్య భద్రత కోసం పరశురామ్, కమల్ ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు ఎం.ఆర్.ఎన్ వర్మ, కాకి రాము, ఆర్. రామచంద్రరావు, ఎం.ఎస్.ఆర్ ప్రసాద్, కోయిలడ పరశురాం, మొల్లి కమల్ కుమార్, మనభూమి సత్యనారాయణ, వైద్యులు డాక్టర్ రఘురామ చక్రవర్తి మరియు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న జర్నలిస్టులకు నిపుణులైన వైద్య బృందం గుండె పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇవ్వడం తో పాటు తగిన సలహాలు, సూచనలు చేసారు.
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Bureau
January 25, 2026 01:41 AM
17 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Jan 23
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
సీతంపేట ఫస్ట్ ప్రైజ్ అనకాపల్లి టీం సొంతంకబడ్డీ
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
21 Jul 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026