బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

*జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో పునర్నియామకంపై రైతుల ఆగ్రహం

Bureau May 14, 2026 04:33 AM 4 views
*జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో పునర్నియామకంపై రైతుల ఆగ్రహం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 
దివ్య దర్శిని న్యూస్ 

*జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో పునర్నియామకంపై రైతుల ఆగ్రహం
అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని ఎలా తీసుకుంటారు?
రాజకీయ ఒత్తిళ్లతోనే నిర్ణయం.. రైతుల ప్రెస్ మీట్*

రోలుగుంట, మండలంలోని జానకిరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం  సీఈవోగా రామకృష్ణను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.తీవ్ర అవినీతి ఆరోపణలు: సీఈవో రామకృష్ణపై గతంలో కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్, బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఈ అక్రమాలపై ప్రస్తుతం సెక్షన్ 51 ప్రకారం విచారణ జరుగుతోంది. విచారణ పూర్తి కాకముందే, బాధ్యుడైన వ్యక్తిని అదే కుర్చీలో కూర్చోబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నించారు.డీసీసీబీ అధికారులపై దాడి యత్నం: గతంలో తనిఖీలకు వచ్చిన డీసీసీబీ  అధికారులపై దాడికి యత్నించిన చరిత్ర ఉన్న వ్యక్తిని తిరిగి నియమించడం అన్యాయమని ధ్వజమెత్తారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన వ్యక్తిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం అంటే అవినీతిని ప్రోత్సహించడమే. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది."బాధిత రైతులుసీఈవో పునర్నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలి.నిష్పక్షపాతంగా విచారణ జరిపి, రైతుల సొమ్మును రక్షించాలి.అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.తమకు న్యాయం జరగని పక్షంలో ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్‌లో పలువురు రైతులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```