బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

*పాడేరు పాత బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిషాంతి

Bureau April 14, 2026 06:47 PM 12 views
*పాడేరు పాత బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిషాంతి

*పాడేరు పాత బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిషాంతి

దివ్య దర్శిని న్యూస్,ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు), ఏప్రిల్ : 14,

 వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తీని తీర్చేందుకు పాడేరు పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కూడలి వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ 
నిషాంతి. టి ఈరోజు ఉదయం రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 
ప్రజల సౌకర్యార్థం ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ చలివెంద్రాన్ని పంచాయతీ శాఖ అధికారులు నిర్వహిస్తారని, ఈ 
నిర్వహణ వేసవి ముగిసే వరకు ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన, చల్లని తాగునీరు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎండల ప్రభావం రోజు రోజుకు  ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తగినన్ని నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, డిఎల్పిఓ పిఎస్ కుమార్,  పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```