బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఉపాధిలో  ముఖహాజరు రద్దు చేయాలి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

Bureau May 06, 2026 06:49 AM 2 views
ఉపాధిలో  ముఖహాజరు రద్దు చేయాలి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

[18:16, 5/5/2026] Dumbrigoda Krishnababu: డుంబ్రిగుడ దివ్య దర్శిని న్యూస్)

      ఉపాధిలో  ముఖహాజరు రద్దు చేయాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

 వలస కూలీలను నివారిస్తూ ఆవాస ప్రాంతాల్లోనే పనులు కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల్లో చేరిన కూలీలకు ప్రస్తుతం అమలులోకి తెచ్చిన ముఖ హాజరు రద్దు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ముఖ హాజరు ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాగర పంచాయతీ పరిధిలో గల గ్రామంలోని ఆ గ్రామ ఉపాధ్యాయ పథకం లబ్ధిదారులతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధి పనుల్లో చేరిన కూలీలకు ముఖ హాజరు నిబంధన అమల్లోకి తీసుకురావడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. పలు ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ లేకపోవడం వల్ల ముఖ హాజరుకు నోచుకోలేక పతున్నారని ఆయన అన్నారు. పనుల్లో చేరిన కూలీలకు ముఖ హాజరు తప్పనిసరి కావడంతో పనుల్లో చేరిన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పైగా ముఖ హాజరు లేకపోతే కూలి డబ్బులు తమ తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాదని ఫలితంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదని ఆయన చెప్పారు. కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖహాజరు లు ను రద్దుచేసి మునుపటి వలె ఉపాధి పనులు నిర్వహించాలని ఆయన కోరారు. అలాగే కూలీలకు పనిదినాలు 200 కల్పించి ప్రస్తుతం నిత్యావసర సరుకుల వినియోగాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 600
పెంచాలని అయన ప్రభుత్వ నికి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు
బి మోహనరావు, టి కుమారి, చెడ్డ
రమూర్తి, బి, నూకరాజు, మెట్లు
ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```