అధికారులు ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, దివ్య దర్శిని న్యూస్:
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులు కు భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశమందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సంబంధించిన ఇంకనూ సమకూర్చవలసిన భూ సేకరణ పై సమీక్షించారు. ట్రైబల్ యూనివర్సిటీ కి విద్యుత్ స్థాపన ఏర్పాట్లు పై సూచిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రికల్ టవర్లు తక్షణం తీయవలసిన అవసరముందని అదేవిధంగా కొత్త గా హెచ్ టి లైన్లు వేయుటకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. భూసేకరణ అనంతరం ఆర్ధిక అనుమతులు వచ్చినవెంటనే బిల్స్ అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తారకరామ తీర్ధసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు , జాతీయ రహదారులు, మూడో రైల్వే లైన్, కొత్తవలస- విజయనగరం నాలుగో రైల్వేలైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. ప్రాజెక్టుల వాఈ రీగా పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్ష చేశారు. శాఖాధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించిన తర్వాతే బడ్జెట్ అంచనా వేయాలన్నారు. వివిధ దశలలో గల భూ సేకరణ ప్రక్రియలను నిర్ణీత గడువు లోగా పూర్తిచేసి, ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు యూనిట్ 2 కోసం జే గుమడాం, బి రాజేరు, జిన్నాం, బొండపల్లి గ్రామాల్లో భూసేకరణ నిమిత్తం పబ్లిక్ నోటీసులు జారీచేయాలన్నారు. జాతీయ రహదార్లు విస్తరణ నిమిత్తం సుమారు ఎనభై ఎకరాలకు రెవిన్యూ శాఖ అనుమతులు ,
అదేవిధంగా స్ట్రక్చర్ల అంచనాలకు ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత భూ లావాదేవీలలో కోర్టులో ఉన్న కేసుల పరిష్కారానికి కృషిచేయాలని రెవిన్యూ అధికారులను కోరారు. భూ సేకరణ పూర్తయిన వాటికి బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని తెలిపారు. అవార్డ్ కు సిద్ధంగా ఉన్నవాటికి అవార్డ్స్ పాస్ చేయాలన్నారు. భూసేకరణ పనులన్నింటికి ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్‌డిఓలు సుధా సాగర్ , రామ్మోహన్, సుధారాణి, ఎస్‌డిసిలు, పాల్గొన్నారు. వర్చ్యువల్ గా ఆర్ అండ్ బి ఈ ఈ, ఇరిగేషన్, జాతీయ రహదారులు, రైల్వే అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఎల్ఏ యూనిట్ల డిటిలు పాల్గొన్నారు.