బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

అనారోగ్య బాధితులకు అండగా ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌వోసీ అందజేసిన చింతకాయల విజయ్

Bureau January 27, 2026 06:44 AM 30 views
అనారోగ్య బాధితులకు అండగా ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌వోసీ అందజేసిన చింతకాయల విజయ్

నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ను అందజేశారు.
​గోలుగొండ మండలం, చీడిగుమ్మల గ్రామానికి చెందిన యెన్నేటి లోవ లావణ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నర్సీపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి వైద్య ఖర్చుల నిమిత్తం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఫార్సు మేరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 48,823  మంజూరు చేసింది.
​ఈ మేరకు ప్రభుత్వం నుండి మంజూరైన CMRF ను చింతకాయల విజయ్ ఈరోజు స్వయంగా బాధితులకు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు వేణు గోపాల్, గోవిందు,  తదితరులు పాల్గొన్నారు

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```