వాటర్ ఏరోడ్రోమ్ అభివృద్ధిపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ జలపుట్ గ్రామం క్రికెట్ స్టేడియం, ముంచింగ్ ఫుట్ మండలంలో బుధవారం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీ పూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జలపుట్ గ్రామంలో ముంచిపుట్టు మండలంలో వాటర్ ఏరో డ్రమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడిందని తెలిపారు. ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలపై ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలకు ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రాంతీయ మరియు పర్యాటక అభివృద్ధి పెరుగుతుందని తెలియజేశారు. స్థానిక ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్టు అంచనాలు, ప్రాజెక్టు నిర్మాణం తద్వారా వాతావరణం మరియు కాలుష్యానికి హాని లేదని అంతేకాకుండా స్థానిక ప్రజలకు లాభాలు చేకూరుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో
జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర , ఎంపీపీ సన్యాసమ్మ
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ ఈ ఈ సరిత, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ ఇన్ఫ్రాక్చర్ జాయింట్ మేనేజర్ శ్రీకాంత్, టూరిజం డిపార్ట్మెంట్ DVM & RD జగదీష్ అయినారు, ముంచింగ్పుట్ తహసిల్దార్ ఎం వి అప్పారావు, స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.