ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత
*జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
నెల్లిమర్ల,దివ్య దర్శిని న్యూస్;
నెల్లిమర్ల ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. గోదాం షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి లోపలి గదులను, సీళ్లను పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న గోదామును సైతం తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో ఆర్డీవో ఎస్.సుధా సాగర్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటిండెంట్ ప్రసాదరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీ తరపున రాజారావు, వైకాపా నుంచి ఎస్.రామారావు, కాంగ్రెస్ నుంచి బీవీ రమణ, జనసేన నుంచి ఎ.రవికుమార్ ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.