ఎరువుల దుకాణాల తనిఖీలు నిర్వహించిన ఏవో జోకా అమృత
ప్రత్తిపాడు,దివ్యదర్శిని న్యూస్..
ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, ఏలూరు గ్రామాల్లో ఉన్నఎరువులు, పురుగుమందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి జోకా అమృత గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు,పురుగుమందుల స్టాక్ రిజిస్టర్లు,విక్రయ రికార్డులను పరిశీలించారు.ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు మాత్రమే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు.రైతులు ఎరువులు, పురుగుమందులు,విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.అలాగే విత్తనాలను రైతులకు విక్రయించే ముందు వాటి మొలక శాతం నిర్ధారించుకోవాలని సూచించారు.ప్రభుత్వం నిషేధించిన పురుగుమందులు,గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదని హెచ్చరించారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందేలా నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని మండల వ్యవసాయ అధికారిణి జోకా అమృత తెలిపారు.