ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
* జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, ఏప్రిల్ 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ జి.పి. రాజశేఖర్‌తో కలిసి ఆదివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఆర్&బి, ఫైర్, ఎలక్ట్రికల్, ఐ&పీఆర్ విభాగాలు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, మెమెంటోస్ బహూకరణతో పాటు ఇతర కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.