బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

Bureau February 05, 2026 06:32 PM 19 views
40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

అనకాపల్లిజిల్లా నర్సీపట్నం,  దివ్య దర్శిని న్యూస్ 

40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

ఒక మహిళతో సహా 7 మంది ముద్దాయిలు అరెస్టు

ఒక కారు , మూడు ద్విచక్ర వాహనాలు , ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం


40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయితో పాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు , నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవత్తమ్మ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు కృష్ణ దేవి  పేట వద్ద ఎస్ఐ రిషికేష్, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పి రాజారావు , గొలుగొండ ఎస్ఐ రామారావు తమ సిబ్బందితో కృష్ణదేవిపేట వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా
ఉన్న WB96E 6809 వాహనం తనిఖీ చెయ్యడం జరిగిందన్నారు.కారులో 20 కేజీల చొప్పున రెండు బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులో తీసుకోగా అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రం నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు తెలియజేశారు. సదురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ఎంతో చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐలను,సిబ్బందిని అభినందించారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```