గంజాయి బ్యాచ్‌లకు చెక్!
నెల్లిమర్లలో డ్రోన్ నిఘా
* గంజాయి విక్రయ, వినియోగదారులపై పంజా విసరణున్న ఎస్ ఐ గణేష్
నెల్లిమర్ల, దివ్య దర్శిని న్యూస్;
నెల్లిమర్ల పోలీసులు గంజాయి విక్రయదారులు, వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం నెల్లిమర్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
చంపావతి నదీతీరం
టిట్కో గృహ సముదాయ పరిసరాలు,
పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాలు మేరకు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రోన్లు వాడకం వల్ల నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించడం చాలా సులభమైందని తెలిపారు.
ఎవరైనా గంజాయి సేవిస్తూ పట్టుబడితే చట్టపరమైన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఈ వ్యసనానికి బానిసై బయటపడలేకపోతే, అలాంటి వారికి పోలీసుల ఆధ్వర్యంలో డి-అడిక్షన్ సెంటర్లకు పంపి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తీసుకొస్తామని సూచించారు.
మీ చుట్టుపక్కల గంజాయి విక్రయిస్తున్నారా?
నేరాలు మరియు గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
ఫోన్ ద్వారా గాని వాట్సాప్ మెసేజ్ ద్వారా 9121109444 నెంబరు కి సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.