బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఘనంగా మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం నిర్వహించిన - బాబీ

Bureau April 25, 2026 04:27 AM 7 views
ఘనంగా మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం నిర్వహించిన - బాబీ

ఘనంగా మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం నిర్వహించిన - బాబీ

తిరుపతిలో మెగా అభిమానుల నడుమ, మెగా యూత్ ఫోర్ నేషనల్ కన్వీనర్ యాడిడ బాబి ఆధ్వర్యంలో.. శుక్రవారం మెగా అభిమానులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ.. తిరుపతిలో మెగా సీనియర్ మరియు యూత్ అభిమానులను ఒకే వేదికపై కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో  అన్ని జిల్లాలకు మెగా యూత్ ఫోర్స్ జిల్లా మండల స్థాయి అధ్యక్షులను నియమించడం జరుగు తుందని తెలిపారు. మెగా కుటుంబానికి ఎప్పటికప్పుడు అండగా నిలిచిన మెగా అభిమానులను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గుర్తుపెట్టుకుని వారికి ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలవడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. రెండు రోజుల్లో ఈ మెగా యూత్ ఫోర్సును ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సీనియర్ అభిమానులకు ప్రత్యేకించి తిరుపతి మెగా అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా సీనియర్ అభిమానులు మెగా యూత్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```