జనసేన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్
తిరుపతి
జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా ఆరణి మదన్ ను పార్టీ అధిష్టానం నియమించింది. రాయలసీమ నుంచి జాయినింగ్స్ కమిటీ లో మదన్ తో పాటు డాక్టర్ హరిప్రసాద్, టీసీ వరుణ్ లకు అవకాశం కల్పించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడిగా పార్టీలో క్రియాశీలంగా పని చేస్తున్న మదన్ కు ప్రస్తుతం కీలకమైన జాయినింగ్స్ కమిటీ సభ్యులు గా నియమించడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తనకు జాయినింగ్స్ కమిటీ లో అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కు ఆరణి మదన్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంకు తటస్థులు, సామాజికవేత్తలు, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ఆకర్షించేందుకు జాయినింగ్స్ కమిటీ పని చేస్తుందని ఆరణి మదన్ తెలిపారు. త్వరలో పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీతో సమావేశం నిర్వహించి పార్టీలోకి ఇతరులను తీసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు.