బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

జిల్లా కలెక్టర్ కి జర్నలిస్టుల ఆత్మీయ సత్కారం

Bureau March 19, 2026 05:02 PM 25 views
జిల్లా కలెక్టర్ కి జర్నలిస్టుల ఆత్మీయ సత్కారం

విశాఖపట్నం, మార్చి 19:తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ ఎం ఎన్.. హరేంధిర ప్రసాద్ ను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ ఎన్ ఏ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నగరంలోని సిరిపురంలో గల వీఎమ్ఆర్డిఏ చిల్డ్రన్స్ ఏరినాలో గురువారం జరిగిన ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను కలిసి దుశ్శాలువా కప్పి  పూల బొకే అందజేశారు.  
 ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరికీ కలెక్టర్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ శుభవేళ అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటినుండి జర్నలిస్టులకు అన్ని విధాలా సహకారం అందజేస్తున్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% స్కూలు ఫీజు రాయితీ, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ( డబ్ల్యూజేహెచ్ ఎస్) కింద జర్నలిస్టులు చెల్లించాల్సిన ప్రీమియంను సిఎస్ఆర్ నిధుల నుండి చెల్లించి ఎంతో తోడ్పాటునిచ్చారు. జర్నలిస్టులకు ఉచితంగా ప్రైవేటు సంస్థలలో వైద్య పరీక్షలు నిర్వహించి సహకరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సేవలను జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు సూరంపూడి వీరభద్రరావు, లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఎ) అధ్యక్షుడు పి .సత్యనారాయణ, అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి కమల్ కుమార్, ఎల్ ఎన్ఏ ప్రతినిధులు  కొయిలాడ పరశురాం,బొంతు నారాయణరావు, ఎన్.ఎస్.ఆర్ గుప్త,ఎం. శ్రీహరి, పృథ్వీరాజు, సూర్య ప్రకాష్, ఎస్ . ఎన్.నాయుడు,  బోని ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```