బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు

Bureau April 22, 2026 04:08 AM 7 views
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు

గొలుగొండ దివ్యదర్శిని 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసైనికులు గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ ఉండే పవన్ కళ్యాణ్ నేడు అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడటం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలే గాక, యావత్తు దేశమంతటా అభిమానులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణికి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని, అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ ను ఆ ధర్మమే రక్షిస్తుందని సూర్యచంద్ర ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల జనసేన అధ్యక్షులు గండెం దొరబాబు, చోద్యం పిఎసిఎస్ డైరెక్టర్, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాదుల ప్రసాద్ బాబు దేవి,సీనియర్ నాయకులు రేగుబళ్ల సాంబమూర్తి, గొలుగొండ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, గొలుగొండ యూత్ అధ్యక్షులు వాసం వెంకటేష్ మరిసా స్వామి నాయుడు, ఎలిశెట్టి సాయి కుమార్, పరవాడ ప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```