బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

దైవ మందిరాలకు శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారం

Bureau May 08, 2026 05:25 AM 9 views
దైవ మందిరాలకు శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారం

దైవ మందిరాలకు శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారం
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవాణి ట్రస్టు ఆర్థిక సహకారంతో మాడుగుల నియోజక వర్గంలో 12 భజన మందిరాలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ మందిరాల నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరయ్యిందన్నారు. వీటిని మూడు రకాలుగా విభజించి, ఒక్కొక్క దానికి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తారన్నారు. ఈ వివరాలను ఆయన గురువారం విలేకరులకు ఫోను ద్వారా తెలిపారు. నియోజక వర్గంలో రూ. 20 లక్షల వ్యయంతో దేవరాపల్లి మండలంలో కలిగొట్ల శివాలయం, ఎ. కొత్తపల్లి మరిడిమాంబ గుడి, దేవరాపల్లిలో విఘ్నేశ్వర, అయ్యప్ప స్వామి
ఆలయం, మాడుగుల మండలం కె.వల్లాపురం రామాలయం, కె.కోటపాడు మండలం కింతాల శివారు గొల్లలపాలెంలో శ్రీకృష్ణుడి గుడి, సూదివలసలోని నూకాంబికా అమ్మవారి ఆలయ భజన మందిర నిర్మాణం చేస్తారు. రూ. 15 లక్షల వ్యయంతో మాడుగుల మండలం పొన్నవోలు రామాలయం, కె.కోటపాడు మండలం గుల్లేపల్లి శివాలయం వద్ద భజన మందిరం నిర్మిస్తారు. రూ.10 లక్షల వ్యయంతో మాడుగుల మండలం తాటిపర్తి శివారు కాశీపురంలో రామాలయం, కె.కోటపాడు మండలం డి. అగ్రహారం రామాలయం, పిండ్రంగి అభయాంజనేయ స్వామి ఆలయం, దేవరాపల్లి మండలం కె.ఎం.పాలెం సన్యాసమ్మతల్లి అమ్మవారి గుడి దగ్గర వీటిని నిర్మిస్తారు. కాగా భజన మందిరాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో వీటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```