నాతవరం మండలానికి చేరిన పాఠ్యపుస్తకాలు.
నాతవరం దివ్య దర్శిని న్యూస్: అనకాపల్లి జిల్లా నుండి నాతవరం మండల కేంద్రానికి బుధవారం ఒకటవ తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మొదటి విడతగా 16500 పాఠ్య పుస్తకాలు చేరినట్లు మండల విద్యాశాఖ అధికారి 2 కె. వరహాల బాబు తెలిపారు. నాతవరం ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుకోగా వాటిని ఎంఆర్సి సిబ్బంది విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. రెండో విడత పూర్తిస్థాయిలో రావాల్సి ఉందని ఆయన అన్నారు.