నర్సీపట్నం నుండి తాళ్లపాలెం వరకు ఉన్న రోడ్డుపై అనేక గుంతలు రావడంతో ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సుమారు 25 లక్షల రూపాయలు నిధులను విడుదల చేయడం జరిగింది.దీనిలో భాగంగా పయనీర్ ( ఆన్ రాక్) కంపెనీ నుండి తాళ్లపాలెం సెంటర్ వరకు, వివిధ చోట్ల భారీ గోతులు పడడంతో, రోడ్లు భవనాల శాఖ అధికారులు గోతులను సరి చేసే పనిలో పడ్డారు.అయ్యన్న నిధులు ఇచ్చారు గాని, ఆ శాఖ అధికారులు రోడ్డును సరి చేసే విధానంలో లోపాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా తాళ్లపాలెం సంత సమీపంలో రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి.ఇక్కడ అనేకసార్లు గోతులను సరిచేసినా, తిరిగి గుంతలు పడుతున్నాయి. కారణం... సక్రమంగా గుంతలను సరి చేయడం లేదంటూ స్థానికులు అంటున్నారు.సంక్రాంతికి వారం రోజులు ముందు ఇక్కడ గోతులను క్రషర్ బుడదతో కప్పి, దానిపై తారు కలిపిన పిక్కను వేయడం జరిగింది. డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణలో వేసిన ఈ రోడ్డు, పది రోజులు గడవకముందే తిరిగి తాళ్లపాలెం సంత వద్ద, గోతులు పడడం ప్రారంభమైంది. దీన్నిబట్టే తెలుస్తోంది ఇక్కడ గోతులు సరి చేసే విధానం ఏ స్థాయిలో జరిగిందో. నిధులు ఇచ్చిన సక్రమంగా పని చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటూ, విచారిస్తున్నారు స్థానికులు. నిధులు ఇచ్చిన నాసిరకం పనులు చేయడం వల్ల, రోజుల వ్యవధిలో తిరిగి గుంతలు పడడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు నిత్యం వందలాదిగా వివిధ రకాలైన వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రోడ్డును గుంతలను మంచిగా వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.గతంలో వేసిన పాత రోడ్లు చాలావరకు బాగానే ఉంటున్నాయి. గుంతలు పడిన చోట వాటిని పూడ్చే సమయంలో నాసిరకమైన పనులు చేయడం వలన, తిరిగి అదే గుంతలు చోటా కన్నాలు పడుతున్నాయి.పూడ్చేందుకు వాడుతున్న మెటీరియల్ సక్రమంగా వినియోగించడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాళ్లపాలెం సంత వద్ద ఇప్పటికే మూడుసార్లు పనులు చేసిన, ఇక్కడ గుంతలను శాశ్వత పద్ధతిలో సరి చేయలేకపోతున్నారు అధికారులు.ఇప్పటికైనా అధికారులు నాసిరకం పనులను పక్కనపెట్టి, ప్రజలకు ఉపయోగపడే రోడ్లను ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు.
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Bureau
January 27, 2026 06:42 AM
18 views
Related News
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026