విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ : పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రైల్వే న్యూ కాలనీ పరిధిలో ఉన్న జీవీఎంసీ హైస్కూల్, కె.ఎన్.ఎం. గర్ల్స్ హైస్కూళ్లను ఆయన సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ అధ్యయన విధానం, సిలబస్ కవరేజ్, ప్రిపరేషన్ ప్లాన్, స్లిప్ టెస్టుల నిర్వహణ, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ పురోగతి గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రశ్నించారు. స్లిప్ టెస్టులు విద్యార్థుల బలాబలాలను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయని, వాటి ద్వారా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై నిరంతరం పర్యవేక్షణ ఉంచి, వ్యక్తిగత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ క్రమంలో విద్యార్థులతో సంభాషించిన ఆయన రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో అధ్యయనం చేయాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు ఆయన వెంట ఉన్నారు.
పదో తరగతి పరీక్షలకు సమర్థవంతమైన సన్నద్ధత అవసరం : జిల్లా కలెక్టర్
Bureau
February 05, 2026 06:37 PM
19 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Jan 23
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026