బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పరిశుభ్రతను పాఠశాల స్థాయి నుండి అలవాటు చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీపూజ

Bureau January 25, 2026 02:04 AM 23 views
పరిశుభ్రతను పాఠశాల స్థాయి నుండి అలవాటు చేయాలి : జాయింట్ కలెక్టర్  శ్రీపూజ

స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్రా నిర్వహణలో భాగంగా అరకులోయ మండల కేంద్రంలోని రవ్వలగూడ ఆశ్రమ పాఠశాల లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ , పాడేరు ఐటిడిఏ పిఓ తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ చేతుల పరిశుభ్రత ద్వారా అనేక రకాల రోగాల నుండి రక్షణ పొందవచ్చు అన్నారు.

భోజనానికి ముందు ప్రతీ ఒక్కరూ చేతులు పరిశుభ్రంగా కడుగుకోవాలని, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ తో కలిసి మొక్కలు నాటారు.

పారిశుధ్య నిర్వహణపై పాఠశాలలలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో విజేతలకు ఆర్.టి.సి రీజనల్ చైర్మన్ దొన్నుదొర తో కలిసి

బహుమతులు అందించారు.

 స్థానిక యం.పి.డి.ఓ ప్రతిజ్ఞ చేయించారు.

 

పాఠశాల ఆవరణను పరిశీలించి, అక్కడ పేరుకుపోయిన చెత్తను చూసి ప్రధానోపాధ్యాయునిపై మరియు డిప్యూటీ యం.పి.డి.ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కార్యక్రమంలో గ్రామ సచివాలయశాఖ జిల్లా నోడల్ అధికారి పి.యస్. కుమార్,

డిపిఓ చంద్రశేఖర్, స్థానిక సిడిపిఓ, యం.ఈ.ఓ పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

21 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```