బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచండి

Bureau May 08, 2026 05:14 AM 4 views
పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచండి

పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచండి

జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించండి

పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచండిపారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచండి

విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్

నగర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగు పరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ పారిశుద్ధ్య నిర్వహణపై అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు మరింత మెరుగుపరచేందుకు ప్రజా ఆరోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరంలో అదనపు పారిశుధ్య కార్మికులను కేటాయించడం ద్వారా నగరంలో గతం కంటే పారిశుధ్యం పనులు మెరుగుపడ్డాయని, ఇంకా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆ దిశగా 30 రోజులలో జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జోనల్ కమిషనర్లు ఫీల్డ్ విజిట్లో నిత్యపర్యవేక్షణ చేసి పారిశుద్ధ్య లోపాలను గమనించి వాటిని సవరించాలన్నారు. ఇప్పటికే జీవీఎంసీ పారిశుద్ధ్య నిర్వహణ కొరకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని, నిత్యం వ్యర్ధాలు సేకరణ చేస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు పడుతున్నాయని అధికారులను ఆరా తీశారు. రోడ్లపైన బహిరంగ ప్రదేశాలలో నివాసితులు, దుకాణదారులు వ్యర్ధాలు వేసినట్లయితే పారిశుధ్య కార్మికులు వారిని గమనించి శానిటరీ ఇన్స్పెక్టర్ కు తెలియజేసినట్లయితే వారి నుండి శానిటరీ ఇన్స్పెక్టర్లు అపరాధ రుసుం వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అదనపు పారిశుద్ధ్య కార్మికులను అన్ని జోనులకు ఏర్పాటు చేశామని, అలాగే వ్యర్ధాలు తరలించేందుకు అదనపు వాహనాలు సమకూరుస్తామని కమిషనర్ తెలిపారు. వ్యర్ధాలు సేకరణకు వెళ్లే వాహనాలు సమయాన్ని దుకాణదారులకు తెలియపరచినట్లయితే, ఆ సమయంలో వ్యర్ధాలు ఆ వాహనానికి అందించేందుకు వీలుంటుందని, అయినప్పటికీ వ్యర్ధాలు దుకాణాల ముందు పడవేసినట్లయితే వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయ వైద్యాధికారులు రాత్రి పారిశుధ్య పనులలో లోపాలు లేకుండా నిత్య పరిశీలనచేసే కార్యచరణ చేపట్టాలన్నారు. అలాగే పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య కార్మికులను, క్లాప్ వాహనాలను సర్దుబాటు చేసి నిర్ణీత సమయానికే విధుల్లో ఉండే విధంగా పర్యవేక్షించాలని సహాయ వైద్యాధికారులను ఆదేశించారు. 

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాయుతంగా కాలువలు, గెడ్డలులలో పూడికలు తీసే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్నారు. వర్షాకాలంలో కాలువలు పొంగి పొర్లేందుకు వీలు లేకుండా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కేటాయించినప్పటికీ విధులకు హాజరు కాని వారిపై ప్రత్యెక దృష్టి సారించి కౌన్సిలింగ్ ద్వారా సవరించే కార్యక్రమం చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

అనంతరం అదనపు కమీషనర్ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ మాట్లాడుతూ వ్యర్ధాలు తరలించే వాహనాలు, పారిశుధ్య కార్మికుల విధుల ప్రక్రియ ప్రణాలికాయుతంగా సిద్దం చేయాలని, పారిశుధ్య కార్మికుల విధులను నిత్యం గమనిస్తూ పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, ఇంటింటి నుండి వ్యర్ధాల సేకరణ పక్కగా జరపాలని అందరు శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```