ప్రత్తిపాడు అడిషనల్ కోర్టు ప్రారంభానికి హైకోర్టు జడ్జీలకు ఆహ్వానం
ప్రత్తిపాడు,దివ్యదర్శిని న్యూస్
ప్రత్తిపాడులో నూతనంగా నిర్మితమైన అడిషనల్ కోర్టు ప్రారంభోత్సవాన్ని ఈనెల 10న నిర్వహించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించేందుకు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ కార్యవర్గం మంగళవారం అమరావతిలోని హైకోర్టుకు వెళ్లింది.ఈ సందర్భంగా న్యాయమూర్తులకు ఆహ్వాన పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు,ప్రధాన కార్యదర్శి బొంగుళూరి మధుబాబు,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మంచికంటి శ్రీనివాస భారతి,లైబ్రరీ సెక్రటరీ లింగంపల్లి శివకుమార్,కార్యవర్గ సభ్యులు కూచిమంచి సూర్య ప్రకాశరావు,రాయి అచ్యుత రామారావు,అలాగే సీనియర్ న్యాయవాదులు కొల్లా వీర్రాజు,అనుసింగరాజు కుక్కుటేశ్వరరావు,పలివెల నాగేంద్రరాజు,కాపిశెట్టి శ్రీనివాసరావు తదితరులు హాజరై హైకోర్టు జడ్జీలను ఆహ్వానించిన వారిలో ఉన్నారు.