బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడుల్లో వ్యక్తి అరెస్ట్ మద్యం స్వాధీనం
* భోగాపురం ఎక్సైజ్ సీఐ రవికుమార్ వెల్లడి
భోగాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అనధికార మద్యం దుకాణాలపై (బెల్ట్ షాపులపై) దాడుల్లో భాగంగా చింతపల్లి గ్రామం పరిది పూసపాటిరేగ మండలం లో ఒక వ్యక్తి వద్ద 08 మద్యం 180 ఎమ్మెల్ పరిమాణం గల బాటిల్స్ తో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ వి. రవికుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై
ఎవరూ అనధికారి మధ్య దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించరాదని,మరియు ప్రోత్సహించరాదని, అనధికారి మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) యొక్క సమాచారాన్ని భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని సూచించారు.
ఈ దాడుల్లో ఎస్ ఐ చంద్రమోహన్,హెడ్ కానిస్టేబుల్స్ రామారావు, మరియు ప్రతాప్ లు పాల్గొన్నారు.