బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కొండపైన క్షేత్రస్థాయి పరిశీలన.

Bureau June 17, 2026 05:38 AM 1 views
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కొండపైన క్షేత్రస్థాయి పరిశీలన.

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం.

భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కొండపైన క్షేత్రస్థాయి పరిశీలన.

తేది: 16 జూన్ 2026, సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు మంగళవారం సాయంత్రం కొండపైన భక్తులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డిప్యూటీ ఇంజనీర్ (ఐ/సి) రామరాజుతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా క్యూ లైన్‌లో భక్తులకు అందుతున్న సేవలను సమీక్షించారు.
సాయంకాల వేళల్లో భక్తులకు తాగునీటి సరఫరా సక్రమంగా అందుతున్నదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఈవో, క్యూ లైన్‌లో నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించి, భవిష్యత్తులో శాశ్వత పరిష్కారంగా మరింత మెరుగైన వాటర్ సప్లై వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.
అలాగే క్యూ లైన్‌లో నిర్వహణ పనులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, వాష్‌రూమ్‌ల నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని, ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సౌకర్యవంతమైన దర్శనానుభూతిని పొందే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ సందర్భంగా ఈవో శ్రీ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

21 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```