అనకాపల్లి జిల్లా నర్సీపట్నం
దివ్య దర్శిని న్యూస్
మహానాడు సన్నాహక సమావేశం: విజయవంతం చేయాలని చింతకాయల విజయ్ పిలుపు
కొడవలూరు రాచర్లపాడు ఈ నెల మే 27, 28, 29 తేదీలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ 'మహానాడు' వేడుకలను విజయవంతం చేసేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు కొడవలూరు మండలం, రాచర్లపాడులోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో బుధవారం మహానాడు సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రతినిధుల నమోదుపై ప్రత్యేక దృష్టి
మహానాడు ప్రతినిధుల నమోదు కన్వీనర్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సమావేశంలో పాల్గొని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పసుపు పండగకు భారీ సంఖ్యలో తరలిరానున్న ప్రతినిధుల కోసం నమోదు ప్రక్రియను వేగవంతం మరియు సులభతరం చేసేలా ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఐటీడీపీ చిత్తూరు, నెల్లూరు నాయకులు పత్తిపాటి యాచేంద్ర నాయుడు, షేక్ రసూల్ లతో భేటీ అయిన విజయ్, సాంకేతిక అంశాలు మరియు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మరియు చింతకాయల విజయ్‌ను ఐటీడీపీ నాయకులు పత్తిపాటి యాచేంద్ర నాయుడు, షేక్ రసూల్ ఘనంగా సత్కరించారు.చింతకాయల విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండగ లాంటిది. నెల్లూరు జిల్లాలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు అంకితభావంతో కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.