దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి అన్నారు. మండల కేంద్రంలోని రైవాడ అతిథి గృహం వద్ద గురువారం మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు అధ్యక్షతన ప్రధానమంత్రి ఉజ్వల యోజన మూడవ విడత ఉచిత గ్యాస్ కలెక్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుతూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వెనకాడ లేదన్నారు. మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర పథకాలు కొనసాగుతున్నాయన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేస్తామన్నారు. మండలంలో 632 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 566 గ్యాస్ కనెక్షన్ లు మంజూరయ్యాయని, త్వరలో మిగిలిన వారికి కూడా అందజేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారును భాస్కరరావుతో సహా పలువురు సత్కరించారు. అనంతరం దేవరాపల్లికి చెందిన అనిమిరెడ్డి మల్లికకు వెలుగు ద్వారా ఎగ్ మార్ట్ సెంటర్ మంజూరు కావడంతో ఆ పథకాన్ని ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె వి ఎల్ ఎన్ మూర్తి, తహశీల్దార్ పి. లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎం వి సువర్ణరాజు, ఏపీఎం ఎస్. ప్రభాకరరావు, సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, మండల టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు పెద్దాడ వెంకటరమణ, దొగ్గ దేముడు నాయుడు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గొర్రుపోటు రామ్మూర్తి నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు పూడి సత్యరావు, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు బండారు రామారావు, శరఖాన సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, కొరుప్రోలు రామలింగస్వామి, చల్లా తాతయ్యలు, గుల్లిపల్లి అర్జునరావు, గంధం జగ్గారావు(జగన్), కడిమి నాగేశ్వరరావు, అల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Bureau
February 05, 2026 06:25 PM
18 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026