దివ్య దర్శిని గొలుగొండ
క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించాలి- మాజీ సర్పంచ్ తోకల సంతోష్ కుమార్
గొలుగొండ మండలం లింగంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ సంతోష్ కుమార్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ రావుల మణికంఠ ఆధ్వర్యంలో గ్రామ యువతకు క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువకులు క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కిట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.
గ్రామంలో యువతకు అవసరమైన క్రీడా సదుపాయాలను కల్పించేందుకు ఎప్పుడూ సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం పట్ల యువకులు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోష్ కుమార్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ రావుల మణికంఠ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మంగరాజు, గ్రామ పెద్దలు గొంతిన నాని, చేబ్రోలు మల్లేశ్వరరావు, గోల్కొండ రవిశంఖర్, బొడ్డు నాని, మారిసా శివ, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.