బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

Bureau February 05, 2026 06:38 PM 16 views
అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు పలువురు రిటైల్ ఇన్వెస్టర్ల (Retail Investor Loss) జీవితాలను తలకిందులు చేశాయి. రేట్లు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాతో అప్పు చేసి మరీ పసిడి కొన్నవారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది (Gold Price Crash).

ఈ నేపథ్యంలో ఆదిత్య షా అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ నెట్టింట ఓ పోస్టు పెట్టారు. తన దృష్టికి వచ్చి ఓ షాకింగ్ ఉదంతాన్ని షేర్ చేశారు. అత్యాశకు పోతే నష్టాలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల తనకు తెలిసిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుపై గరిష్ఠ పరిమితి వరకూ లోన్ తీసుకుని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాడని ఆదిత్య తెలిపారు. మొత్తం రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాడని అన్నారు. నెల రోజుల్లో తన డబ్బుపై 10-12 శాతం రాబడి పక్కా అని బలంగా నమ్మి రిస్క్ తీసుకున్నాడని పేర్కొన్నారు. కానీ, జనాలు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో బంగారం, వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలోనే దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వ్యక్తి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అత్యాశ ఫలితంగా సదరు వ్యక్తికి నష్టాలు, అప్పులు, భారీ క్రెడిట్ కార్డు బిల్లుతో తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అత్యాశకు పోయేవారికి కనువిప్పు కలిగించే ఉదాహరణ ఇదని వ్యాఖ్యానించారు (Rs.10 Lakh Investment Loss).

పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గించే ప్రణాళిక, మార్కెట్ నుంచి సరైన సమయంలో తప్పుకునేందుకు వ్యూహం లేకపోతే ఇలాంటి నష్టాలే ఎదురవుతాయని పలువురు కామెంట్ చేశారు. సంపద కూడబెట్టేందుకు ఏళ్లకు ఏళ్లు గడిచిపోతే నష్టపోయేందుకు క్షణకాలం చాలని గుర్తు చేశారు. రిస్కీ పెట్టుబడుల విషయంలో ఈ సూత్రం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది...

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```