బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

విశాఖలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, హీట్ స్ట్రెస్ పై సామర్థ్యాభివృద్ధి వర్క్ షాప్ నిర్వహణ.

Bureau May 14, 2026 04:42 AM 6 views
విశాఖలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, హీట్ స్ట్రెస్ పై సామర్థ్యాభివృద్ధి వర్క్ షాప్ నిర్వహణ.

విశాఖలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, హీట్ స్ట్రెస్ పై సామర్థ్యాభివృద్ధి వర్క్ షాప్ నిర్వహణ.

*శాస్త్రీయ, సుస్థిర పరిష్కారాలపై విస్తృత చర్చలు.

-జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి.

విశాఖపట్నం, దివ్యదర్శిని న్యూస్    జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ( నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం- NCAP) మరియు హీట్ స్ట్రెస్ అంశాలపై సామర్థ్యాభివృద్ధి వర్క్ షాప్ ను బుధవారం విశాఖపట్నంలోని నోవోటెల్ లో బెంగళూరుకు చెందిన పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP), ఆర్థా గ్లోబల్ సంస్థలు జీవీఎంసీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో నగర వాయు కాలుష్య నియంత్రణ, హీట్ స్ట్రెస్ సమస్యల నివారణకు శాస్త్రీయ, సాంకేతిక మరియు సుస్థిర పరిష్కారాలపై చర్చించారు.

ఈ వర్క్ షాప్‌లో సీనియర్ పాలసీ నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులు మరియు నిపుణులు పాల్గొని విశాఖ నగరంలో వాయు నాణ్యత నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాంకేతిక సామర్థ్యాభివృద్ధి, డేటా ఆధారిత నిర్ణయాలు మరియు బహుళ భాగస్వామ్య వ్యవస్థల సమన్వయం ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధి సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి జీవీఎంసీ అదనపు కమిషనర్  డి.వి. రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై , పరిశ్రమలు మరియు వాహనాల ద్వారా వెలువడే ఉద్గారాలను నియంత్రించడం అత్యంత అవసరమని, విశాఖ నగరాన్ని సుస్థిర మరియు వాతావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ ఆఫీసర్ మరియు ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నిరంతర చర్యల వలన విశాఖ నగరంలో వాయు కాలుష్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని, అయినప్పటికీ కొన్ని రోజులలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300 వరకు నమోదవుతోందని తెలిపారు.

సి-స్టెప్ ఎయిర్ క్వాలిటీ బృందానికి  స్వాగత డే మరియు డాక్టర్ పీయూష్ భరద్వాజ్ , పాలసీ స్పెషలిస్ట్ అనిర్బన్ బెనర్జీ మరియు శివాని శర్మ పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్‌లో జీవీఎంసీ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, రవాణా శాఖ, పరిశ్రమల ప్రతినిధులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.  వాయు నాణ్యత నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు, శాస్త్రీయ పర్యవేక్షణ వ్యవస్థలు, ఎమిషన్ ఇన్వెంటరీలు, సోర్స్ అపోర్షన్‌మెంట్ అధ్యయనాలు, ఎయిర్ క్వాలిటీ మోడలింగ్, క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు వంటి అంశాల ప్రాధాన్యతపై నిపుణులు వివరించారు. అలాగే పట్టణ ప్రణాళికల్లో హీట్ రిస్క్ అంచనాలను సమన్వయం చేయాల్సిన అవసరాన్ని కూడా నిపుణులు వివరించారు. సాంకేతిక సెషన్లలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వాయు నాణ్యత సవాళ్లు, భాగస్వామ్య సంస్థల సమన్వయం, అమలులో ఉన్న లోపాలు మరియు అవకాశాలపై నిపుణులు చర్చించారు. “బేసిక్స్ ఆఫ్ ఎమిషన్ ఇన్వెంటరీ అండ్ డెవలపింగ్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్స్”, “డేటా టు యాక్షన్ పైప్‌లైన్” వంటి సెషన్లలో ఎయిర్ క్వాలిటీ అబ్జర్వేషన్స్, మోడలింగ్ వ్యవస్థలు, ఎమిషన్ ఇన్వెంటరీలు మరియు వాటి ప్రాధాన్యతపై వివరించారు.  వర్క్ షాప్ లో శ్రీమతి స్వాగత డే పట్టణ వాయు కాలుష్య నియంత్రణకు రంగాల వారీ ఉత్తమ విధానాలు, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. చివరి సెషన్ “ఫ్రం హీట్ మ్యాప్స్ టు యాక్షన్” పేరుతో నిర్వహించబడగా, హీట్ స్ట్రెస్ నివారణకు మైక్రో స్థాయి హీట్ ఇంటెలిజెన్స్‌ను పాలసీ మరియు స్పందన వ్యవస్థల్లో సమన్వయం చేయాల్సిన అవసరాన్ని ఆర్థా గ్లోబల్ ప్రతినిధులు వివరించారు.

విశాఖ నగరంలో సుస్థిర వాయు నాణ్యత నిర్వహణ, వాతావరణ అనుకూల పట్టణాభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణ, అమలులో సవాళ్లు మరియు తీసుకోవాల్సిన చర్యలపై గ్రూప్ చర్చలు నిర్వహించారు. కార్యక్రమం పరస్పర చర్చలు, అభిప్రాయాలు జరిగినవి.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠి, పర్యవేక్షక ఇంజనీర్లు కె .శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, తిరుమల రావు, శాంతిరాజ్, కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్, ఎంఆర్ఎస్ అప్పారావు, ఈ సి డి పి ఓ ప్రసన్న వాని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాసుకి జీవీఎంసీ ఎస్ ఆర్ యు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజామణి, బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```