విశాఖ లో క్రీడల సందడి - వేసవి శిబిరాలు కు సిద్దం కావాలి
* ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్స్ గౌరవ చైర్మన్ గణబాబు...
* గణబాబు కు పుష్పగుచ్చం అందించి స్వాగతించిన కార్యదర్శి చినబాబు...
* క్రీడల సమ్మర్ క్యాంప్ లు విజయవంతంగా నిర్వహించండి...
విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్
విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖ నగరవ్యాప్తంగా అన్ని క్రీడల్లో సమ్మర్ క్యాంప్‌లను ఘనంగా నిర్వహించాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, (జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ ) గణబాబు పిలుపునిచ్చారు.
మంగళవారం జీవీఎంసీ మరియు శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అసోసియేషన్ లతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యనారాయణ,జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఎమ్మెల్యే గణబాబు కు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
సమావేశం లో బాగంగా విశాఖ నగరం మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సమ్మర్ క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసి
విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా శిబిరాలు ఉండాలని తెలిపారు.అన్ని క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేసి ఈ సమ్మర్ క్యాంప్‌లను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో నగరంలోని వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, క్రీడా అధికారులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.