బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి - మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు

Bureau May 14, 2026 04:32 AM 7 views
వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి - మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు

వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి
- మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. మాడుగుల నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన  కాశీపురం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి త్రినాథస్వామి మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడును కాశీపురంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి త్రినాథ స్వామిని మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం తనను నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించిన మాజీ డిప్యూటీ సిఎం బూడికి త్రినాథ స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయుకులతో కలిసి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని త్రినాథ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి మంగునాయుడు, బండారు దేముడునాయుడు, దాసరి గోపి, చలుమూరి చంద్రమోహన్, ఆదిరెడ్డి కన్నంనాయుడు, ఈర్లె రాము, ఆదిరెడ్డి మహలక్ష్మీనాయుడు, తదితర వైఎస్సార్ సీపీ నాయుకలు ఉన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```