సబ్బవరం డిడి న్యూస్
సబ్బవరం: పెందుర్తి నియోజకవర్గం లోని సీఎం సహాయనిధి ద్వారా పలువురు అనారోగ్య లబ్ధిదారులకు పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవెర్స్ ఫెడరేషన్ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తనయుడు యువ నాయుకులు గండి వంశీ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా యువ నాయకులు గండి వంశీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేదలు, నిరుపేదలు, అత్యవసర వైద్య అవసరాల్లో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణ రావు, ఏఎంసి చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, పెందుర్తి మండల పార్టీ అధ్యక్షులు కునిగంటి కనకరాజు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బోండా సత్యారావు సబ్బవరం ఎంపీటీసీ చైతన్య,గండి దేముడు, ఏఎంసి డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ బొండా కళ్యాణ్, సర్పంచ్ కన్నం నాయుడు, పెందుర్తి మండల ఉపాధ్యకులు గొలగాని సత్యనారాయణ, గొటివాడ మాజీ సర్పంచ్ రమేష్,పెదగాడి అప్పలరాజు, కోరిబిల్లి సుందరరావు, భీమేశ్, గోలగాని సంతోష్,స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Bureau
January 29, 2026 02:17 AM
16 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026