నెల్లిమర్ల పోలీసుల ఉక్కుపాదం
* గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్!
*నెల్లిమర్ల యువతకు గంజాయిని విక్రయిస్తున్న మనోహర్ అరెస్ట్
నెల్లిమర్ల, దివ్య దర్శిని న్యూస్:
నెల్లిమర్ల పట్టణంలో యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న గంజాయి విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చంపావతి నదీతీరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందాను నెల్లిమర్ల ఎస్ ఐ బి. గణేష్, సిబ్బంది రట్టు చేశారు నెల్లిమర్ల పట్టణం డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి ఒడిశాలోని రాయగడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు. అలా తెచ్చిన గంజాయిని స్థానిక యువకులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
స్థానికుల సమాచారం అందుకున్న ఎస్సై గురువారం చంపావతి నదీతీరంలోని గ్యాస్ గోడౌన్ వెనుక భాగంలో గల తుప్పల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పోలీసుల రైడ్‌లో గంజాయి కొనుగోలు చేస్తూ, విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు: మనోహర్ (డైట్ కాలనీ) - ఇతని వద్ద నుండి 1.2 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
నెల్లిమర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్, సత్య దివాకర్, నవీన్, మరియు లోకేష్. వీరు మనోహర్ వద్ద 100 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి, సేవించడానికి వెళ్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
"యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయిని విక్రయించినా, కొనుగోలు చేసినా లేదా సేవించినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్: 9121109444కి సమాచారం ఇవ్వాలని కోరారు.