•విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ మహిళ వినతి
విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. బాధిత మహిళను కుటుంబంతో సహా సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంటబెట్టుకుని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భస్థ శిశువు మృతికి సంబంధించి వివరాలు తెలుసుకుంటారు. శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో శ్రీమతి పట్నాల ఉమాదేవి అనే మహిళ పవన్ కళ్యాణ్ కలిశారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా.. వైద్యులు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా, ఎంతో అమానవీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయ్యిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి అందోళనకంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారని, కాన్పు సమయంలో తన గుండెల పైకి ఎక్క కూర్చుని సాధారణ కాన్పు పేరిట అమానవీయంగా ప్రవర్తించారని వాపోయారు. చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతోపాటు జీవితకాలం మనో వేదన మిగిల్చిందంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు. తన లాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఆ మహిళ వేదన విని చలించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున తగిన భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను
Bureau
February 01, 2026 07:05 AM
19 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Jan 23
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026