బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

▪️ అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం స్పష్టీకరణ… హర్షం వ్యక్తం చేసిన పల్లా

Bureau April 01, 2026 05:31 PM 13 views
▪️ అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం స్పష్టీకరణ… హర్షం వ్యక్తం చేసిన పల్లా

అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం స్పష్టీకరణ… హర్షం వ్యక్తం చేసిన పల్లా 
 ▪️ మళ్లీ మావిగన్ అని మూడు రాజధానుల డ్రామా కి తెరలేపిన జగన్ రెడ్డి .. ప్రజలు తస్మాత్ జాగ్రత్త 

 -- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు 

 అమరావతి, ఏప్రిల్ 01: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిఫలంగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

ఈ సందర్భంగా పల్లా గారు మాట్లాడుతూ.. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అనే భావనతో ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇదని తెలిపారు. అమరావతి నిర్మాణం రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లు, ప్రజల కలల సమాహారమని పేర్కొంటూ, శాంతియుత పోరాటానికి దక్కిన విజయమిదని స్పష్టం చేశారు. రైతుల దీక్షలు, ఉద్యమాలు, ప్రజల అంకితభావానికి ఇది న్యాయం చేసిన నిర్ణయమన్నారు.

ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, ఈ బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి, సందిగ్ధతకు ఇది శాశ్వతంగా తెరదించిందన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం స్పష్టతనిచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి స్పష్టమైన దిశ లభించిందని పల్లా గారు పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖచిత్రం, గౌరవప్రతీకగా అమరావతి నిలిచిందని, ఇకపై అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడతాయని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని పల్లా ధ్వజమెత్తారు. ప్రపంచంలో దాదాపు ఎక్కడా అమలు కాని విధానాన్ని తీసుకువచ్చి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. సచివాలయం ఒకచోట, అసెంబ్లీ మరోచోట ఉండే పరిస్థితులు పరిపాలనలో ఆలస్యం, ఖర్చుల పెరుగుదల, సమన్వయ లోపాలు తీసుకువస్తాయని పేర్కొన్నారు. అది అభివృద్ధి కాదు, అయోమయం సృష్టించే విధానమని స్పష్టం చేశారు.

మళ్లీ మావిగన్ అని మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం జగన్ రెడ్డి రాజకీయ స్వార్థానికి నిదర్శనమని పల్లా గారు మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.

అమరావతి బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి పల్లా గారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పాత్రతో ఈ విజయం సాధ్యమైందన్నారు.

బలమైన రాజధాని నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న అనుమానాలకు ఇక శాశ్వతంగా ముగింపు పలుకుదామని పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```