బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు... అరెస్ట్ 

Bureau May 14, 2026 04:45 AM 7 views
12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు... అరెస్ట్ 

12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు... అరెస్ట్ 
* ఇంచార్జ్ డిఎస్పి ఎస్. రాఘవులు వెల్లడి 
 విజయనగరం,దివ్య దర్శిని న్యూస్:

 విజయనగరం పట్టణంలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన. ఒక మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం పట్టణానికి చెందిన రాజేటి సత్యారావు (53)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు వివరాలు వెల్లడించారు. విజయనగరం పట్టణంలో ఉంటున్న మైనరు బాలిక (12) వేసవి సెలవులు కావడంతో తన అమ్మమ్మ పాల వ్యాపారంలో సహాయం చేస్తూ ఆదివారం ఉదయం నిందితుడు విజయనగరం పట్టణానికి చెందిన రాజేటి సత్యారావు ఇంటికి పాలు పొయ్యడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో నిందితుడు తప్పా ఎవరూ లేరు. అదును చూసి పాలు పొయ్యడానికి వచ్చిన ఆ మైనరు బాలికను పాలు డబ్బులు ఇస్తానని చెప్పి లోపలికి పిలిచి, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. అనంతరం ఆ బాలిక ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకోనుచుండగా బాలిక తల్లి ఒంటి మీద గాయాలను చూసి, ఏం జరిగిందని అడగగా, ఆ బాలిక జరిగిన విషయం తల్లితో చెప్పింది. వెంటనే బాలిక తల్లి విజయనగరం మహిళా పోలీస్ స్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.శిరీష పోక్సో కేసు నమోదు చేసారు. వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఈ. నరసింహమూర్తి కేసు దర్యాప్తును ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా నిందితుడు విజయనగరం పట్టణం బిసి కాలనీకి చెందిన రాజేటి సత్యారావును బుధవారం పోలీసు అరెస్ట్ చేసారు. వెంటనే రిమాండుకు కూడా తరలించనున్నట్లు విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు, లేదా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణించి, న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షి పడేలా చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా దర్యాప్తు పూర్తి చేసి, కేసు త్వరలో ట్రయల్ పూర్తయ్యే విధంగాను, నిందితడు కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో చాలా పోక్సో కేసులలో నిందితులకు జైలు శిక్షలు పడి జైలులో మగ్గుతున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఈ.నరసింహమూర్తి, ఎస్ఐ జి.శిరీష, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```