నాతవరం దివ్యదర్శని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు.
నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో ఒకే జీవో (G.O. 64) ద్వారా 29 రహదారుల కోసం రూ. 22 కోట్లు కేటాయించినందుకు మంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నాతవరం మండలంలో 7 రహదారుల అభివృద్ధికి రూ. 8.12 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.
ఈ పనులకు సంబంధించి మరో 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, రాబోయే వేసవి కాలం ముగిసేలోపు ఈ 29 రహదారుల పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పీకర్ స్పష్టం చేశారు. రహదారి పనుల నిర్వహణలో ఎక్కడా అవకతవకలు జరగకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. నాణ్యమైన రహదారుల ద్వారా గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.
నాతవరం మండలంలో ఏడు రహదారులకు 8.12 కోట్లు విధులు మంజూరు..
Bureau
February 07, 2026 07:07 PM
12 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026