17 మంది బెల్ట్ షాప్ నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు
* మండలంలో బెల్ట్ షాప్ నిర్వాహకుల గుండెల్లో సింహ స్వప్నంగా మారిన ఎక్సైజ్ సీఐ వి. రవికుమార్
భోగాపురం,దివ్య దర్శిని, న్యూస్ :
భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసిన వివరాల ప్రకారం
మంగళవారం భోగాపురం మండలం తహసీల్ధార్ కార్యాలయంలో తహసీల్దార్ సమక్షంలో భోగాపురం మండలం కు చెందిన ఇది వరలో బెల్ట్ షాపులు నిర్వహించి కేసులు నమోదైన 17 మంది వ్యక్తులను అండర్ సెక్షన్ 129 అఫ్ BNSS ACT 2023 ప్రకారం మరలా బెల్ట్ షాపులు నిర్వహించి కేసులు నమోదైనచో లక్ష రూపాయల అపరాధ రుసుము చెల్లించుట లేదా జైలు శిక్ష అంగీకారం పై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో గల కొంతమంది బెల్ట్ షాప్ నిర్వాహకులు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసి, అదే మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్మకాలు చేస్తూ ఎంతోమంది పేదల పొట్ట కొడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా బెల్ట్ షాప్ ని ర్వాహకులు మద్యాన్ని కల్తీ చేయడంతో, మద్యానికి బానిసలు అయిన ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు సేవించడం వలన అనారోగ్యం పాలై వారి యొక్క మరణ వార్త వినాల్సి వస్తుందని తెలియజేశారు. ఆ కారణంగా భోగాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనేక గ్రామాల్లోనూ, అనుమానిత ప్రాంతాల్లోనూ దాడులు జరుపుతున్నప్పటికీ కొంతమేర అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్న కారణంగా ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రవికుమార్ తెలియజేశారు.