33వార్డులో ఓటిపి వెరిఫికేషన్ పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
దక్షిణ నియోజకవర్గ 33 వ వార్డులో వైయస్ఆర్సీపీ క్యాడర్ రిజిస్ట్రేషన్ ఓటిపి ప్రక్రియ జోరుగా జరుగుతున్నాయి. బుధవారం మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ 33వ వార్డు కార్యాలయాన్ని సందర్శించారు. వార్డు ప్రెసిడెంట్ ముత్తబత్తుల రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము, ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటిపి ప్రక్రియను వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై పరిశీలించారు. వార్డు నాయకులకు ఆయన వివరిస్తూ దక్షిణ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటిపి ప్రక్రియ కార్యక్రమం చేయడం వలన త్వరగా పూర్తవుతాయని చెప్పారు. అలాగే టెక్నికల్ కి సంబంధించిన అంశాలను 33 వ వార్డు నాయకులకు వివరించారు. అన్ని వార్డుల్లో 33 వ వార్డు ముందంజలో ఉండేలా ప్రతిష్టాత్మకంగా జరగాలన్నారు. అలాగే రాష్ట్రంలో దక్షిణ నియోజక వర్గం మొదటి స్థానంలో ఉండాలని వాసుపల్లి ఆదేశించారు. క్యాడర్ లో కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పించడమే వైయస్సార్సీపీ లక్ష్యమన్నారు. మన అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమిష్టి కృషి అవసరం అన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ...వార్డ్ ప్రెసిడెంట్ ముత్తబాటుల రమేష్, మాజీ కార్పొరేటర్ పత్చిపల్లి రాము, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ళ రామరాజు,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, స్టేట్ అంగనవాడి విభాగం జనరల్ సెక్రెటరీ సలాది భాను, సౌత్ సంస్కృతి విభాగం ప్రెసిడెంట్ సూర్య,వార్డ్ నాయాకులు ఆడారి మహేష్,హేమ,సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవార మహేష్, జిల్లా నాయాకులు బుడుగు శ్రీనివాస్,కృష్ణ రెడ్డి,కొల్లి సత్యవతి,లక్ష్మీకాంతం వార్డ్ నాయాకులు, బూత్ నాయకులు తదితరులు పోలుగున్నారు