58వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం 58 వ వార్డు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖ జిల్లా కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన ఆధ్వర్యంలో కోరమండల్ గేటు వద్ద గల అన్నా క్యాంటీన్ సముదాయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గణబాబు విచ్చేసి ముందుగా కేకును కట్ చేసి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి పాదాచారులకు శీతల పానీయాలని పంపిణీ చేశారు. జన్మదిన సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో..... శ్రీహరిపురం సంఘం, రంగుడు రాజేష్, గుడ్ల గుణ, శ్రీహరిపురం సంఘ సభ్యులు, మరియూ కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తంగుడు సంతోష్, కళింగ వైశ్య నాయకులు ఊన్నా మోహన్ రావు, కిల్లం శెట్టి విశ్వేశ్వరరావు, మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లం శెట్టి రంగనాథం, ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్, ఉపాధ్యక్షులు గెంబలి కిషోర్, జామి రవి,కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కోరాడ శ్రీనివాసరావుకు జన్మదిన తెలియజేశారు.